రాహుల్ గాంధీ ఢిల్లీలో చేపట్టిన ధర్నాపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. సాయంత్రం 4 వరకు ఏ పార్టీ కూడా భేటీకి సమయం కోరలేదని తెలిపింది. 'మమ్మల్ని కలవాలంటే మా ప్రతినిధి ద్వారా అనుమతి తీసుకోవాలి. 240 మంది ఎంపీలతో భేటీ నిర్వహించాలని ప్రతిపాదన వచ్చింది. వారి వినతిపత్రం స్వీకరించేందుకు అధికారిని పంపుతామని చెప్పాం. మా ప్రతిపాదనను వారు తిరస్కరించారు' అని ఈసీ వెల్లడించింది.
వార్తలు
రాహుల్ ధర్నాపై ఎన్నికల సంఘం ప్రకటన


