రక్షణ రంగ పరిశోధనలో భారత్ మరో మైలురాయిని చేరింది. పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన హై-ఆల్టిట్యూడ్ ప్లాట్‌ఫారమ్ (HAPS) ప్రయోగాత్మక విమానయాన పరీక్షను డీఆర్డీవో విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రయోగాత్మక విమానం సముద్రమట్టానికి 21 కి.మీ. ఎత్తును విజయవంతం చేరుకుంది. దీంతో డీఆర్డీవో, వాయుసేనకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు.
వార్తలు
రక్షణ రంగ పరిశోధనలో మరో మైలురాయి


