ఢిల్లీలో ఆకాశవాణి భవన్ దగ్గర కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరసన కొనసాగుతోంది. దీంతో నిరసన విరమించాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అయితే.. ఎన్నికల సంఘాన్ని కలిసేవరకు వెళ్లేది లేదని రాహుల్ తేల్చి చెప్పారు. 'నిరసన చేయడం మా రాజ్యాంగబద్ధమైన హక్కు. 300 మంది ఎంపీలు ఈసీని కలుస్తారు. మా నిరసనలతో ఏమైనా ఇబ్బంది ఉంటే.. మరొక చోటును చూపిస్తే అక్కడ నిరసన చేపడతాం' అని స్పష్టం చేశారు.
వార్తలు
కొనసాగుతున్న రాహుల్ గాంధీ నిరసన


