హైదరాబాద్: 28°C
వార్తలు

మహారాష్ట్రలో తీవ్ర నీటి సంక్షోభం

మహారాష్ట్రలో తీవ్ర నీటి సంక్షోభం నెలకొంది. ఆ రాష్ట్రంలో 284 మండలాలను అధికారులు కరువు ప్రాంతాలుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో నీటి పొదుపుపై మహారాష్ట్ర సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 16 నుంచి పట్టణాల్లో 10 శాతం నీటి కోత విధించింది. పరిశ్రమల్లో 30 శాతం నీటి రీసైక్లింగ్ తప్పనిసరి చేసింది. నీటి లీకేజీలు అరికట్టాలని స్థానిక సంస్థలకు ఆదేశించింది.