హైదరాబాద్: 28°C
వార్తలు

శివాలయ పునర్నిర్మాణానికి రూ.3.43 కోట్ల నిధులు

NDL: ఆత్మకూరు మండలం వేల్పనూరులోని శ్రీ ఈశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.3.43 కోట్ల సీఎఫ్‌జీ నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మంగళవారం కోరారు. పనులకు పరిపాలనా అనుమతులు త్వరగా ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కోరారు. ఈ మేరకు అమరావతి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.