హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ, అమిత్ షా దేశాన్ని హైజాక్ చేశారు: రాహుల్

ఢిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు చేపట్టిన ఈసీ మార్చ్ ముగిసింది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశారని రాహుల్ గాంధీ విమర్శించారు. ఓట్ చోరీతో మోదీ, అమిత్ షా దేశాన్ని హైజాక్ చేశారని అన్నారు. దానికి జ్ఞానేష్ కుమార్, మోహన్ భగవత్ సహకరించారంటూ ధ్వజమెత్తారు. 'బీజేపీ నేతలు దేశ ద్రోహానికి పాల్పడ్డారు. ఎవరూ తప్పించుకోలేరు.. అందరిపై చర్యలు తప్పవు' అని హెచ్చరించారు.