హైదరాబాద్: 28°C
వార్తలు

ఈసీ తీరుపై రాహుల్ గాంధీ ఆగ్రహం

ఢిల్లీలో ఆకాశవాణి భవన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక సహా పలువురు కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈసీ తీరుపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 300 మంది ప్రజాప్రతినిధులు వచ్చినా ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, జ్ఞానేష్ కుమార్ దేశంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశారని విమర్శించారు.