దేశ రక్షణలో విశాఖలోని HSL కీలక పాత్ర పోషిస్తోందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. విశాఖను సముద్ర పారిశ్రామిక కేంద్రంగా చేయాలని తెలిపారు. తొలి స్వదేశీ నౌక 'జల ఉష' తయారీ నుంచి నేటి ఆధునిక నౌకల వరకు HCL పయనం ఎంతో గొప్పదన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా రక్షణ రంగంలో మనపై మనకు మరింత నమ్మకం పెరుగుతోందని చెప్పారు. 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
వార్తలు
దేశ రక్షణలో HSL కీలక పాత్ర పోషిస్తోంది: రాజ్‌నాథ్


