హైదరాబాద్: 28°C
వార్తలు

రెండేళ్లలో భారత్‌ తయారీ పౌర విమానాలు: కేంద్రమంత్రి

రెండేళ్లలో భారత్ తయారీ పౌర విమానాలు వస్తాయని ఆశిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వీటిని అంతర్జాతీయ సంస్థతో కలిసి మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేస్తున్నట్లు చెప్పారు. భారత వైమానిక రంగం నుంచి దాదాపు 1600 విమానాల ఆర్డర్లు ఉన్నట్లు వెల్లడించారు. రానున్న 10 ఏళ్లలో మరో 100 ఎయిర్‌పోర్టులు నిర్మించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.