హైదరాబాద్: 28°C
వార్తలు

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే: రాహుల్

ఢిల్లీ విపక్ష ఎంపీలు నిరసన చేపట్టిన వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక చాలు సమయం వచ్చిందని పేర్కొన్నారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. మరో వైపు ఈసీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తున్న విపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కేంద్రానికి, సీఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.