హైదరాబాద్: 28°C
వార్తలు

తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్‌కు 'సూర్య' నామకరణం

ఏపీ విశాఖ హిందూస్థాన్‌ షిప్ యార్డులో నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్‌కు 'సూర్య'గా నామకరణం చేశారు. 46,000 టన్నుల బరువు, 81 టన్నుల ప్రాపెల్లర్‌తో ఇది రెండో అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌గా నిర్మాణం జరగనుంది. సముద్ర జలాల్లో భారత నౌకాదళ శక్తిని మరింత పెంచే క్రమంలో ఈ నౌకకు సూర్యగా పేరు పెట్టినట్లు చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్ స్వామినాథన్ తెలిపారు.