హైదరాబాద్: 28°C
వార్తలు

కాసేపట్లో విపక్ష ఎంపీల ఆందోళన.. పోలీసుల మోహరింపు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ సేవ్ డెమొక్రసీ పేరుతో విపక్ష ఎంపీలు ఆందోళనకు సిద్ధమవుతున్న వేళ బీజేపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. పార్లమెంటు మరకద్వారం నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టనున్న తరుణంలో భారీగా పోలీసులను మోహరించింది. కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని చర్యలు చేపట్టింది.