హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నిరసనల్లో పాల్గొనటం లేదు: ఆప్

SIRకు వ్యతిరేకంగా ఢిల్లీలోని ఈసీ ఆఫీసు ఎదుట ఇవాళ ఇండీ కూటమి నిర్వహించే నిరసనలో తాము పాలుపంచుకోవడం లేదని ఆప్ వెల్లడించింది. SIRకు వ్యతిరేకంగా వామపక్షాలు, సీజేపీ దేశంలో ఏదో ఒక చోట ఆందోళనలు చేపడుతునే ఉన్నాయని చెప్పింది. ఇండీ కూటమి నిరసన కేవలం ఆ కూటమికే సంబంధించినదని.. అందుకే తాము పాల్గొనటం లేదని తెలిపింది. మరో వైపు డీఎంకే కూడా ఈ ధర్నాలో పాల్గొనటం లేదని ప్రకటించింది.