హైదరాబాద్: 28°C
వార్తలు

పలు ఆసుపత్రులకు మమత నోటీసులు

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా న్యాయవాది SSKM ఆస్పత్రితోపాటు బంగూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్‌కు లీగల్‌ నోటీసులు జారీ చేశారు. 2021 నాటి మమత వైద్య రికార్డులను అనుమతి లేకుండా బహిర్గతం చేసినందుకు ఈ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. 2021 ఎన్నికల సమయంలో మమత కాలికి గాయమైందంటూ ప్రజలకు అబద్ధం చెప్పి సానుభూతి పొందారని సీఎం సువేందు అధికారి ఆరోపించిన సంగతి తెలిసిందే.