హైదరాబాద్: 28°C
వార్తలు

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ సింగ్

TG: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయన సేవలను గుర్తించి కొలీజియం సిఫారసుల ఆధారంగా ఈ నియామకం చేపట్టినట్లు వెల్లడించారు. కాగా, హైకోర్టు యాక్టింగ్ సీజేగా జస్టిస్ శ్యామ్ కోశాయి వ్యవహరించనున్నారు.