హైదరాబాద్: 28°C
వార్తలు

ఓటు బచావో-దేశ్ బచావో: కేసీ వేణుగోపాల్

CEC జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ 'ఓటు బచావో-దేశ్ బచావో' పేరుతో దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. కేసీ వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 10 నుంచి దేశవ్యాప్త నిరసనలు, నవంబర్ 1న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అలాగే, నవంబర్ 25 వరకు ఓట్ల తొలగింపుపై ఇంటింటి సర్వే చేపట్టి, NOV 25, 26 తేదీల్లో చలో ఢిల్లీ యాత్ర చేపట్టనున్నారు.