SIRపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష MPలు రేపు ఎన్నికల సంఘం కార్యాలయానికి మార్చ్ చేపట్టనున్నారు. పార్లమెంట్ నుంచి EC కార్యాలయం వరకు ‘సేవ్ డెమోక్రసీ మార్చ్’ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ MP జైరాం రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 19 ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పాల్గొంటారని చెప్పారు. SIR ప్రక్రియపై తమ ఆందోళనలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు.
వార్తలు
రేపు ఈసీ కార్యాలయానికి ప్రతిపక్ష MPల మార్చ్


