BPT: కర్లపాలెం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఎస్‌ఐ ఎస్.రవీంద్ర ఆధ్వర్యంలో హెల్మెట్, వాహన పత్రాలు పరిశీలించారు. నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు విధించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ఉల్లంఘనలకు కఠిన చర్యలు ఉంటాయన్నారు.
వార్తలు
'హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి'


