హైదరాబాద్: 28°C
వార్తలు

మంగళగుడ్డెకు సోలార్ లైట్లు

ASR: అనంతగిరి మండలం మంగళగుడ్డెలో 12కుటుంబాలు విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నాయి. కరెంట్ సౌకర్యం కల్పించాలని కోరినా, రెవెన్యూ రికార్డుల్లో పేర్లు లేవన్న కారణంతో విద్యుత్ సరఫరా కాలేదు. ఈ సమస్యపై మీడియాలో వచ్చిన కథనాలు చూసిన మాజీ ఐఏఎస్ అధికారి ఈఎస్‌ఐ శర్మ స్పందించి, తన సొంత నిధులతో మూడు సోలార్ లైట్లు విరాళంగా అందజేశారు.