GNTR: తెనాలిలో ఈ నెల 18న దళిత క్రైస్తవుల ఆత్మగౌరవ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం అంబేద్కర్ సేవా ట్రస్ట్ కార్యాలయంలో సభకు సంబంధించిన కరపత్రాలను నాయకులు ఆవిష్కరించారు. అంబేద్కర్ సేవా ట్రస్ట్, జై భీమ్ ఫెడరేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో అన్నాబత్తిని సత్యనారాయణపుర వేదిక వద్ద సభ జరుగుతుందని తెలిపారు.
వార్తలు
18న దళిత క్రైస్తవుల ఆత్మగౌరవ సభ


