హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఈ గ్రామాల్లో పవర్ కట్

AKP: నర్సీపట్నం డీఈఈ బి. వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డాది సబ్‌స్టేషన్ పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఆర్‌డీఎస్‌ఎస్ అభివృద్ధి పనుల వల్ల విజయరామరాజుపేట, మంగళాపురం ఫీడర్ల కింద గల వడ్డాది, కుమందనిపేట తదితర గ్రామాల్లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంట్ ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.