హైదరాబాద్: 28°C
వార్తలు

కాకా విగ్రహానికి మంత్రుల నివాళి

HYD: కాకా విగ్రహానికి మంత్రులు అజహరుద్దీన్, వివేక్ వెంకటస్వామి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకా ప్రజల కోసం చేసిన సేవలను, ఆయన ప్రజా జీవితాన్ని స్మరించుకున్నారు. పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కాకా చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. కాకా ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని మంత్రులు తెలిపారు.