AP: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురంలో నెల రోజుల వ్యవధిలో 2,500 నాటు కోళ్లు మృతిచెందాయి. దీంతో రూ.10 లక్షల మేర నష్టం వాటిళ్లింది. పశుసంవర్ధక శాఖ అధికారులు భోపాల్‌కు శాంపిల్స్ పంపడంతో బర్డ్‌ఫ్లూగా నిర్ధారించారు. అధికారులు సిద్ధరాంపురం పరిసర ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఫౌల్ట్రీ యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వార్తలు
రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ కలకలం


