హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ జీఎస్టీ స్కామ్.. సూత్రధారి అరెస్ట్

AP: చిత్తూరు జిల్లాలో GST స్కామ్ కలకలం రేపుతోంది. స్క్రాప్ వ్యాపారం పేరుతో అమాయకుల ఆధార్, పాన్ కార్డులు తీసుకుని వారి పేర్లపై నకిలీ GST, బ్యాంకు ఖాతాలు తెరిచి లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలున్నాయి. చిన్న వ్యాపారులకు నగదు ఆశ చూపి వారి పత్రాలు తీసుకుని, కోట్ల రూపాయల స్క్రాప్ లావాదేవీలు చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. స్కామ్‌లో కీలక సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేశారు.