హైదరాబాద్: 28°C
వార్తలు

అత్యాచార ఘటనలు.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ వరుస అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రేప్ ఘటనలతో దేశ రాజధానిలోని మహిళలు అభద్రతా భావంతో జీవిస్తున్నారని వ్యాఖ్యానించింది. మహిళలు సురక్షితంగా భావించేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. నేరం జరిగిన తర్వాత ఏమి చేశారన్నది ముఖ్యం కాదని.. అసలు నేరం జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టారనేది ముఖ్యమని తెలిపింది.