హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.50 కోట్లు విలువైన హెరాయిన్‌ స్వాధీనం

అంతర్రాష్ట్ర హెరాయిన్ సరఫరా-తయారీ నెట్‌వర్క్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని అధికారులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా సుమారు రూ.50 కోట్ల విలువైన హెరాయిన్, ఇతర నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.  రోహిణి జిల్లాలోని పోలీసు బృందం ఈ ఆపరేషన్ నిర్వహించి డ్రగ్ నెట్‌వర్క్ గుట్టును రట్టు చేసింది.