హైదరాబాద్: 28°C
వార్తలు

ఉగ్రవాదుల చేతిలో 'లోరా'.. సైన్యానికి సవాల్

జమ్మూకశ్మీర్ అడవుల్లో ఉగ్రవాదుల ఏరివేతకు యత్నిస్తోన్న భద్రతా బలగాలకు కొత్త సవాల్ ఎదురైంది. సైన్యం కంటపడకుండా ఉండేందుకు ఉగ్రవాదులు ఓ సరికొత్త ఘోస్ట్ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నట్లు తేలింది. దీనిని లోరా- లాంగ్ రేంజ్, లో పవర్ ఆయుధం అని పిలుస్తారు. దీనికి ఎలాంటి సిమ్ కార్డు, మొబైల్ టవర్, వైఫై అవసరం ఉండదు. దీంతో లోరాను గుర్తించడం భద్రతా బలగాలకు అసాధ్యంగా మారింది.