ఓట్ల తొలగింపుపై జస్టిస్ భుయాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరణిస్తే తప్ప ఓటు తీయొద్దని, నోటీసులు, విచారణ తర్వాతే ఓటు తొలగించాలన్నారు. ఓటు తొలగింపు అంటే శరీరం నుంచి ఆత్మను వేరు చేయడమే అని తెలిపారు. ఆర్టికల్ 326ను ఎవరూ మార్చలేరని, రాజ్యాంగం కంటే ఏ అధికారి పెద్ద కాదని గుర్తుచేశారు. ఏ స్థాయిలో ఉన్నాసరే రాజ్యాంగ ఉల్లంఘన సరికాదన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనను కోర్టులు సమర్థించవన్నారు.
వార్తలు
జస్టిస్ భుయాన్ కీలక వ్యాఖ్యలు


