హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్దతుంబులం వద్ద తప్పిన కారు ప్రమాదం

KRNL: ఆదోని మండలం పెద్దతుంబులం గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి కారు ప్రమాదానికి గురైంది. కర్ణాటకకు చెందిన కారు ఎదురుగా వచ్చిన లారీని తప్పించే క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్క పొలాల్లోకి దూసుకెళ్లింది. రాత్రి ఘటన జరగగా, స్థానికులు జేసీబీ సాయంతో కారును బయటకు తీశారు. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు.