హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షానికి కూలిన 40 ఏళ్ల కమ్యూనిటీ భవనం

ASR: రోలుగుంట మండలం గుండుబాడు పంచాయతీ గుర్రాలపాలెంలో గత రాత్రి కురిసిన వర్షానికి కమ్యూనిటీ భవనం పైకప్పు కూలిపోయింది. దాదాపు 40 ఏళ్ల నాటి ఈ పాత పెంకుటిల్లు పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. రాత్రి సమయం కావడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై వీఆర్వోకు సమాచారం అందించి, నూతన భవనం నిర్మించాలని కోరారు.