హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ ఛైర్మన్ పదవి రేసులో లగడపాటి?

పల్నాడు జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్ పదవికి నూజెండ్ల సీనియర్ టీడీపీ నేత లగడపాటి వెంకట్రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సర్పంచ్, ఎంపీపీ, జిల్లా టీడీపీ పదవులతో పాటు DLDA ఛైర్మన్‌గా పనిచేసిన ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. టీడీపీకి, ప్రజలకు దీర్ఘకాలంగా సేవలందించడం, పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఆయనకు కలిసొచ్చే అంశాలుగా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.