PLD: నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈవోతో కలిసి పరిసరాలను పరిశీలించారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, భక్తుల వసతులపై ఆరా తీశారు. క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే


