హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలిసారి తిరుమలకు వచ్చా: క్రికెటర్ శిఖర్ ధావన్

TPT: తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో భారత క్రికెటర్ శిఖర్ ధావన్ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం వేకువజామున పాల్గొన్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. తొలిసారి తిరుమలకు వచ్చానని, దర్శనం ఎంతో చక్కగా జరిగిందని ధావన్ తెలిపారు. ఆలయ అధికారులు, సిబ్బంది చక్కగా చూసుకున్నారని, అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయనతో పలువురు అభిమానులు ఫోటోలు దిగారు.