హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాలివీడు రామాలయ ధ్వజస్తంభంపై పిడుగు

అన్నమయ్య జిల్లా గాలివీడు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం సమీపంలోని రామాలయ ధ్వజస్తంభంపై పిడుగు పడింది. దీంతో ధ్వజస్తంభానికి సంబంధించిన రాళ్లు పక్కకు కదిలాయి. ఘటనతో స్థానికులు, భక్తులు ఆందోళనకు గురయ్యారు. ధ్వజస్తంభాన్ని అధికారులు పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.