హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిడుగు పడి గేదె మృతి

అన్నమయ్య: రాయచోటి మండలం దిగువ అబ్బవరం గ్రామం దిగువ ఇందుకూరుపల్లెలో పిడుగు పడింది. చెట్టు కింద కట్టివేసిన సంబా రమణమ్మకు చెందిన గేదెపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. గేదె మృతితో సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని బాధితురాలు తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆమె కోరారు.