హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తలుపులమ్మ లోవకి పోటెత్తిన భక్తులు

KKD: తుని మండలం లోవలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 12 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ సేవలు, ప్రసాదాల విక్రయం, విరాళాల ద్వారా దేవస్థానానికి రూ.7,04,199 ఆదాయం వచ్చినట్లు ఈవో విశ్వనాథరాజు తెలిపారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఈవో విశ్వనాథరాజు పర్యవేక్షించారు.