WG: అదనపు క ట్నం కోసం వేధిస్తున్న భర్త, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు అత్తిలి ఎస్‌ఐ కె.ఎన్. విశ్వనాథ్ తెలిపారు. మట్టపర్తిగరువుకు చెందిన బంగారు లక్ష్మీగాయత్రికి, వరిఘేడుకు చెందిన సోమరాజుతో 2015లో వివాహమైంది. ఇటీవల అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
అదనపు కట్నం డిమాండ్ పై కేసు నమోదు


