హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

4 కౌన్సిలర్ సీట్లు ఇవ్వాలని బ్రాహ్మణ పెద్దల డిమాండ్

కోనసీమ: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించాలని ఆ వర్గ పెద్దలు డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి అమలాపురంలో బ్రాహ్మణ ప్రముఖులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో కనీసం 4 గురు బ్రాహ్మణులను కౌన్సిలర్ అభ్యర్థులుగా బరిలోకి దింపి, తమకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలంటూ ఈ సందర్భంగా ఏకగ్రీవ తీర్మానం చేశారు.