హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినుకొండలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

పల్నాడు జిల్లా వినుకొండ సబ్‌స్టేషన్‌లోని ఫీడర్‌-2లో సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇరుకు బజారు, లాయర్‌ స్ట్రీట్, సురేష్‌ మహల్‌ రోడ్, ఏబీఎం కాంపౌండ్, ఫ్యాన్సీ సెంటర్, పెద్దమసీదు, కామటేశ్వరాలయం తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.