హైదరాబాద్: 28°C
వార్తలు

సినీనటి లక్ష్యంగా సీఎంపై అసభ్యకర పోస్టులు

TG: సీఎం రేవంత్‌రెడ్డి, ఓ సినీనటిని లక్ష్యంగా చేసుకుని 'ఎక్స్‌'లో అసభ్యకర పోస్టులు పెట్టిన 'డిగ్‌టీవీ తెలుగు' ఖాతా నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత కైలాష్‌ సజ్జన్‌ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్న ఈ ఉద్దేశపూర్వక చర్యపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.