హైదరాబాద్: 28°C
వార్తలు

'అభిజీత్‌ దీప్కేపై హత్య కేసు నమోదు చేయాలి'

ముంబై శివాజీ పార్క్‌లో అనుమతి లేకుండా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలో వృద్ధుడు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఆందోళనలో 75 ఏళ్ల వృద్ధుడు గుండెపోటుతో మరణించడానికి నిర్వాహకుల నిబంధనల ఉల్లంఘనే కారణమని 'శివాజీ పార్క్ సిటిజన్స్ ఫోరం' ఆరోపించింది. ఈ నేపథ్యంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై హత్య కేసు నమోదు చేయాలని వారు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.