హైదరాబాద్: 28°C
వార్తలు

పాకిస్తాన్‌కు భారత్ గట్టి హెచ్చరికలు!

సరిహద్దు ఉగ్రవాదం, చొరబాట్లపై PAKకు IND తీవ్ర నిరసన తెలిపింది. ఈ అంశంపై న్యూఢిల్లీలోని PAK దౌత్యవేత్తకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా నోటీసులు జారీ చేసింది. సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే దుశ్చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. ఉగ్రవాద కట్టడికి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, జాతీయ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని తేల్చిచెప్పింది.