హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

TG: వనపర్తి జిల్లా కనిమెట్ట గ్రామంలో మహిళా భవనం, అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులకు, బుర్రవాగు కాజ్వే ప్రారంభానికి ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సీసీ కెమెరాలను ప్రారంభించి, కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ప్రజల హామీలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.