హైదరాబాద్: 28°C
వార్తలు

అశోక్ సింఘాల్‌కు వెంకయ్య నాయుడు నివాళి

HYD: హైదరాబాద్‌లో విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన అశోక్ సింఘాల్ జన్మ శతాబ్ది సమ్మేళనంలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ధర్మ పరిరక్షణ, సామాజిక సామరస్యం కోసం సింఘాల్ చేసిన సేవలను కొనియాడారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.