హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు డెంటల్ చైర్ల ప్రారంభం

MDK: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు అత్యాధునిక దంత వైద్యం ఉచితంగా అందించేందుకు నూతన డెంటల్ చైర్లను ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ లింబాద్రి తెలిపారు. ఇవాళ నర్సాపూర్ ఏరియా ఆస్పత్రి, రామాయంపేట సీహెచ్‌సీల్లో వీటిని ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రారంభించనున్నారు. ఈ సౌకర్యంతో మెరుగైన వైద్యం సులువుగా అందుబాటులోకి రానుంది.