రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఉత్తరాఖండ్ నుంచి దినేష్ ఆర్యను, పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉపఎన్నికకు రుక్మిణి మల్లిక్‌ను ఎంపిక చేసింది. ఉత్తరాఖండ్‌లో బీజేపీకి మెజారిటీ ఉండటంతో దినేష్ ఆర్య గెలుపు లాంఛనమే. ఇటీవల టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన ప్రముఖ నటి రుక్మిణికి సీటు దక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది. అక్టోబర్ 16న ఈ ఎన్నికలు జరగనున్నాయి.
వార్తలు
రాజ్యసభ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల ప్రకటన


