హైదరాబాద్: 28°C
వార్తలు

భాగ్యనగర్ సొసైటీ బాధితులకు మహేశ్వర్ రెడ్డి మద్దతు

MDCL: కూకట్‌పల్లి భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ ప్లాట్ యజమానుల నిరాహార దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే అల్లెటి మహేశ్వర్ రెడ్డి సందర్శించారు. ఇళ్ల నిర్మాణ అనుమతుల కోసం పోరాడుతున్న వారికి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 1,450 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. వారి హక్కుల కోసం పోరాడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.