హైదరాబాద్: 28°C
వార్తలు

43వ అంతస్తు నుంచి దూకిన యువకుడు.. కారణమిదే!

నోయిడాలో(UP) ఓ ఎత్తైన భవనం 43వ అంతస్తు నుంచి దూకి సంభవ్ జైన్(28) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే విడాకుల సెటిల్మెంట్ ఆ యువకుడి ప్రాణం తీసింది.  రెండేళ్ల కాపురానికి ముగింపు పలుకుతూ భార్యతో రూ.3 కోట్ల భరణం ఒప్పందం చేసుకుని.. రూ.కోటి చెల్లించాడు. మిగతా డబ్బుల కోసం ఒత్తిడి పెరగడంతో 'నాన్నా.. ఇక నువ్వు ఎవరికీ డబ్బులివ్వొద్దు' అని చెప్పి బలవన్మరణానికి పాల్పడ్డాడు.