ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ టైర్ల తయారీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టైర్లు కావడంతో మంటలు వేగంగా వ్యాపించి, చుట్టుపక్కల దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
వార్తలు
యూపీలో భారీ అగ్నిప్రమాదం


