హైదరాబాద్: 28°C
వార్తలు

ఎడ్లబండిపై సీఎం విజయ్ సందడి

తమిళనాడు సీఎం విజయ్ వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దారాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక బరిలో ఉన్న తమ పార్టీ అభ్యర్థి సత్యభామకు మద్దతుగా ఆయన భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన స్వయంగా ఎడ్లబండిని నడుపుతూ ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం ప్రచార వాహనంపైకెక్కి ఉత్సాహంగా ప్రచారం చేశారు. భారీగా తరలివచ్చిన జనంతో రోడ్‌షో కిక్కిరిసిపోయింది.